విటమిన్-సి గల ఆహారం ప్రస్తుతం చాలా ముఖ్యం..ఎందుకంటే?

మన శరీరంలో విటమిన్ సి తగిన శాతం ఉంటే దానిలో రోగనిరోధక కణాలు వైరస్ మరియు బ్యాక్టిరియాను సమర్థవంతంగా ఎదుర్కొగలవు. ముఖ్యంగా జలుబు నుంచి రక్షించడానికి విటమిన్-సి చాలు ముఖ్యం. 

రోగనిరోధక శక్తి పెరుగుదలకు..

శరీరానికి విటమిన్ల అవసరానికి సంబంధించి అనేక పరిశోధనలు ఉన్నాయి. విటమిన్-సి మన శరీరంలో రోగనిరోధక కణాలను పెంచడంలో సహాయపడుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలో ప్రధానంగా లింఫోసైట్లు మరియు ఫాగోసైట్లు ఉన్నాయి. అవి మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. డ్యామేజ్ ప్రివెన్షన్ లోని విటమిన్-సి మన శరీరంలో తెల్లరక్త కణాలను పెంచడంలో సహాయపడటమే కాకుండా హానికర అణువుల నుంచి రక్షణ అందిస్తుంది. విటమిన్-సి ఫ్లూతో పోరాడే సమార్థ్యాన్ని పెంచుతుంది.

చర్మ రక్షణకు..

మన చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ -సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్-సి చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తుంది. మరియు చర్మం యొక్క ఎగువ రక్షణ పొరను బలంగా చేస్తుంది. కొన్ని అధ్యయనాలలో, విటమిన్-సి గాయాల వైద్యం సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని కనుగొనబడింది. అంటే విటమిన్-సి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గాయం త్వరగా నయం అవుతుంది.

విటమిన్-సి లోపం ఉన్న వ్యక్తుల్లో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. న్యుమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాాశాలు ఉన్నాయి. న్యుమోనియా ఉన్న రోగికి విటమిన్-సి సప్లిమెంట్స్ ఇస్తే, రోగి త్వరగా కోలుకుంటాడు. 

కరోనాలో విటమిన్-సి యొక్క ప్రయోజనాలు

కోవిడ్-19 బాధితురాలిగా మారిన వ్యక్తి శరీరంలో న్యెమోనియా వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో విటమిన్-సి తో నిండిన ఆహారం తీసుకుంటే కరోనా వైరస్ నుంచి కోలుకోవడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే కరోనాి వైరస్ ను ఎదుర్కొనేందుకు విటమిన్-సి సహాయపడుతుందని ప్రస్తుతం ఎటువంటి రుజువు లేదు. 

విటమిన్-సి గల ఆహారం

విటమిన్-సి చాలా పండ్లు, కూరగాయలలో విరివిగా లభిస్తుంది. వీటిని రోజు మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాలసిన విటమిన్-సి అందుతుంది. విటమిన్-సి ముఖ్యంగా జామ, కివీస్, బెల్ పెప్పర్స్, స్ట్రాబెర్రీస్, నారింజ, బొప్పాయి, బ్రోకలీ, టమోటా, కాలే, స్నో బఠానీలలో పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల వీటిని ఎప్పుడు మన ఆహారంలో తీసుకోవాలి. 

హైబీపీ నియంత్రణ..

అధిక రక్తపోటు సమస్యలు ఉన్న వారు క్రమం తప్పకుండా విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెరిగిన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 

ఐరన్ లోపానికి..

మన శరీరంలో ఐరన్ ఒక ముఖ్యమైన పోషకం. ఇది శరీరంలో రకరకాల విధులను కలిగి ఉంటుంది. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి మరియు శరీరంలో ఆక్సిజన్ ను రవాణా చేయడానికి ఐరన్ అవసరం. విటమిన్ సి ఆహారం నుంచి ఇనుము శోషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 100 మిల్లి గ్రాముల విటమిన్-సి తీసుకోవడం వల్ల ఇనుము శోషణ 67 శాతం మెరుగుపడుతుంది. తత్ఫలితంగా విటమిన్ -సి ఐరన్ లోపానికి గురయ్యే వ్యక్తులలో రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 

మెమోరీ పెరుగుదలకు..

విటమిన్-సి, విటమిన్-కె అధికంగా డైట్ తీసుకోవడం వల్ల మన మెమోరీ బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మన మెమోరీ తగ్గుతుంది. కాని విటమిన్-సి కలిగిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటే, వృద్ధాప్యంలో కూడా మెమోరీని కాపాడుకోవచ్చు. 

 

Leave a Comment