గసగసాల వల్ల ఉపయోగాలెన్నో.. అతిగా వాడితే ఆ నష్టాలెక్కువ..!

గసగసాలు అతిగా వాడితే  పురుషుల్లో ఆ సామర్థ్యం  తగ్గుతుంది అని నిపుణులు అంటా ఉన్నారు. మనం వంటల్లో వాడే గసగసాల వల్ల చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి.అలాగని మన పెద్ద వాళ్లు చెప్పిన విధముగా “మితముగా తింటే ఆహారము అమృతము అమితగముగా తింటే విషము” అన్నట్లుగా వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం తీరని నష్టం తప్పదు.

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైనది గసగసాలు ఇవి చిన్నవిగా,తెల్లగా ఉంటాయి.ఇవి వంటకు మంచి రుచి ఇస్తుంది.మన దేశములో  పూర్వం నుంచి వీటిని వంటలతోపాటు ఔషధంగా కూడా వాడుతున్నారు. అయితే చాలా మంది తెలియక దాన్ని ఒక మసాలా పొడిలా మాత్రమే వాడుతుంటారు. కానీ ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రకరకాల వ్యాధులకు నివారిణిలా ఇది పనిచేస్తాయి. కూరకు రుచిని ఇచ్చినట్టుగానే మనిషి శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.వీటి ఉపయోగాలు చాలా ఉన్నాయి.

గుండె జబ్బులు ఉన్నవారికి గసగశాలు చాలా మంచిది.వీటిని ఫ్రై చేసి,చెక్కర కలిపి ఉదయం,సాయంత్రం సమయములో అర్ధ స్పూన్ తీసుకుంటే గుండెకు చాలా మంచిది.మలబద్దకం తగ్గడానికి కూడా గసగసాలు మంచి మందు లాగా పని చేస్తుంది. దీనిలో  పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.మలబద్దకం తగ్గడానికి కూడా గసగసాలు మంచి మందు లాగా పని చేస్తుంది. దీనిలో  పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

మూత్రాపిండల్లో రాళ్లు తయారుకాకూండ చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు,కాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.కొంతమందికి అనేక కారణాల వల్ల సరిగా నిద్ర రాదు.నిద్ర మంచిగా రావాలి అంటే గసగసాలు తీసుకోవాలి.రోజు రాత్రి సమయం పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపి తాగితే చాలు. 

చక్కటి నిద్ర కలుగుతుంది.శ్వాస సమస్యలకు చెక్. గసగసాలు ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్  గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి.గసగసాలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు తీసుకోవడము మంచిది.కడుపులో మంట,పుండు, ఎసిడిటీ వున్న వారు గసగసాల్ని వాడితే  పేగులలో అల్సర్లు, వంటివి తగ్గుతాయి.

చుండ్రు ఉన్నవారు వీటిని నానబెట్టి పాలతో కలిపి మొత్తగా రుబ్బి దాన్ని తలకు రాసుకోవాలి. తరువాత కుంకుడు రసంతో స్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు.జిగట విరేచనాలు అవుతుంటే గాసగసాలని బాగా దోరగా వేయించి పొడి లాగా చేసుకోవాలి.తరువాత వాటిని పూటకు 5 గ్రాముల చొప్పున అన్నంలో కలుపుకొని తింటే ఫలితం ఉంటుంది.గసగసాలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే, మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది.అని నిపుణులు అంటున్నారు.

 

Leave a Comment