ఏడిస్తే ఇన్ని ప్రయోజనాలా?

మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో, ఏడుపు కూడా అంతే ముఖ్యం.. ఎవరైన ఎక్కువ బాధ కలిగిననా లేక మరీ సంతోషంగా ఉన్నా కంటి నుంచి కన్నీళ్లు వస్తుంటాయి. అయితే భావోద్వేగాల నుంచి వచ్చిన కన్నీళ్ల వల్ల  అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 ఏడవడం వల్ల ప్రయోజనాలు..

  • మనం బాధలో ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే పీల్ గుడ్ రసాయనాలు విడుదలవుతాయి. దీని వల్ల శారీరక, మానసిక భావోద్వేగాల్లో మార్పలు కలుగుతాయి. శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. 
  •  కన్నీళ్ల వల్ల చెడు ఆలోచనలు దూరమై.. ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. 
  • కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్ లు క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ ఉంటుంది. కన్నీళ్ల వల్ల కళ్లలో ఉండే దుమ్ము, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఏడవడం వల్ల మెదడు, శరీర ఉష్ణోగ్రతలు క్రమపద్ధతిలో ఉంటాయి. 
  • ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్లల్లో దుమ్మూధూళి పడ్డప్పుడు కళ్ల మంట తగ్గించడానికి రెప్లెక్స్ టియర్స్ ఉపయోగపడుతుంది. 
  • ఎక్కువ భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. 
  • కొన్ని పరిశోధనల ప్రకారం.. కన్నీళ్లలో కొన్ని విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇది శరీరంలో విషాన్ని తొలగిస్తుంది. 
  • భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సహజ ప్రక్షాళనగా పనిచేస్తాయి. 
  • అలాగే ఏడుపు వల్ల కింటికి తేమను ఇస్తుంది. ఏడుపు కళ్ల పొడిదనం, ఎరుపు మరియు దురదను నివారిస్తుంది. ఏడుపు డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏడుపు ప్రతికూల భావోద్వేగాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 
  • ఏడుపు పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Leave a Comment