Ben Stokes Injury : ఐపీఎల్ కు బెన్ స్టోక్స్ దూరం.. రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బ..!

రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు.. దీంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ ఆడిన బంతిని బెన్ స్టోక్స్ ముందుకు డైవ్ చేసి క్యాచ్ పట్టాడు.

ఈక్రమంలో బెన్ స్టోక్స్ ఎడమ చేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సివచ్చింది. అయితే గాయం తీవ్రత అధికంగా ఉండటంతో ఐపీఎల్ 2021లో బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండడని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. వేలు విరగడంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నాడని, అయినా జట్టుకు తన సపోర్ట్ అందిస్తాడని ట్వీట్టర్ లో పేర్కొంది.  

రాజస్తాన్ జట్టులో బెన్ స్టోక్స్ కీలక ఆటగాడని, మైదానంలోనే కాక డ్రెసింగ్ రూమ్, ఆఫ్ ద ఫీల్డ్ లో అతడి సేవలు తమకు విలువైనవి తెలిపింది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని, జట్టు బలబలాలు, బలహీనత మార్పుల విషయంలో బెన్ స్టోక్స్ సేవలు వినియోగించుకుంటామని ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో తెలిపింది.

Leave a Comment