ఒళ్లంతా మట్టితో బ్యూటీ.. ఎవరో తెలుసా?

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అందంగా కనిపించేందుకు కొందరు మేకప్ ఉత్పత్తులను వాడతారు.. మరి కొందరు సహజసిద్దంగా అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇక హీరోయిన్లు అయితే అందంగా కనిపించేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 

ఈక్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన శరీరం అందంగా కనిపించేందుకు వినూత్నంగా ప్రయత్నించింది. బుదరలోకి దిగి ఒళ్లంతా మట్టి పూసుకొని మడ్ బాత్ చేసింది. ఇలా చేసిన ఊర్వశి ‘నా ఫేవరేట్ మడ్ బాత్ స్పా’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో షేర్ చేసింది. 

‘క్లియోపాత్ర మడ్ బాత్ ను ఇష్టపడేది. ఇప్పుడు నేను ఇష్టపడుతున్నాను. బాలేరిక్ బీచ్ యొక్క ఎర్రమట్టిని ఆస్వాదిస్తున్నారు. ఇది రోమన్ దేవతల సౌందర్య రహస్యం. అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు శరీరంపై ఉన్న విషపూరిత కణాలు తొలగించుకోవడానికి చాలా కాలం నుంచి ఇలా చేస్తున్నాను. శరీరం మొత్తం రేగడి మట్టి పూసుకొని కూర్చుంటే శరీరంతో పాటు మనుసుకు ప్రశాంతత ఉంటుంది’ అంటూ ఊర్వశి చెప్పుకొచ్చారు.  

 

Leave a Comment