డ్రైనేజీ వద్ద టపాసులు కాలుస్తున్నారా..? అయితే బీ కేర్ ఫుల్..ఎందుకో ఈ వీడియో చూడండి..!

దేశంలో పిల్లా పాపలతో కలిసి జరుపుకునే పండుగా దీపావళి.. కుల, మత ప్రాంత విభేదాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకుంటారు. ప్రస్తుతం దేశమంతా దీపావళి వేడుకలకు సిద్ధమవుతోంది. పండుటపూట రాత్రి ఇంటిల్లిపాదీ టపాసులు కాల్చి వేడుక చేసుకుంటారు. ముఖ్యంగా చిన్నారులకు టపాసులు కాల్చడమంటే ఎంతో సరదా.. అయితే వారిని ఓ కంట కనిపెడుతూ జగ్రత్తపడాలి. 

ముఖ్యంగా డ్రైనేజీ సమీపంలో టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి. డ్రైనేజీ లైన్ల వద్ద కవర్ లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో టపాసులు వెలిగించినప్పుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. అలాంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఆ వీడియోను గమనిస్తే.. కొంత మంది చిన్నారులు ఒక్కచోట చేరి డ్రైనేజీ పైకప్పుపై టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందరూ భయంతో తలో దిక్కుకు పరిగెత్తారు. ఆ తర్వాత కొద్ద సేపటి వరకు ఆ డ్రైనేజీ హోల్స్ నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో కొందరు చిన్నారులు తల వెంట్రుకలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ పెద్దగా గయాలు కాలేదు. డ్రైనేజీ లైన్ల నుంచి విషపూరిత, పేలుడు స్వభావం గల వాయువులు వెలువడుతుంటాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యంగా డ్రైనేజీ లైన్ల వద్ద టపాసులు పేల్చవద్దని వారికి సూచించాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment