బుల్లెట్ బండిపై.. నోరురించే చికెన్ ఐటమ్స్..!

చదువుకుంటే ఉద్యోగమే చేయాలా? అవసరం లేదు.. వినూత్న ఐడియా ఉంటే చాలా డబ్బులు ఏ విధంగా అయినా సంపాదించవచ్చు.. కరోనా తర్వాత చాలా మంది మంచి చదువులు చదువుకున్న వారు సైతం కొత్త ఐడియాలతో టీ స్టాల్స్, హోటల్స్, పానీ పూరి సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ ఇలా రకరకాల వ్యాపారాలు మొదలు పెట్టి విజయం సాధిస్తున్నారు. 

ఈ కోవలోకే వస్తాడు పిల్లి శివరామక్రిష్ణ.. బుల్లెట్ బండిపై మొబైల్ బార్భీక్యూ చికెన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. వివధ రకాల చికెన్ ఐటమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. కలర్స్, ఆయిల్స్, టెస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, మైదా వంటివి వాడకుండానే వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేస్తున్నాడు. 

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన శివరామక్రిష్ణ 2013లో బీటెక్ పూర్తి చేశాడు.. ఆ తర్వాత హైదరాబాద్ లో వింగ్స్ అండ్ ఫ్రైస్ రెస్టారెంట్ లో 3 సంవత్సరాలు మేనేజర్ గా పనిచేశాడు. డోమినో పిజ్జా రాజమహేంద్రవరం, హైదరాబాద్ లో రెండేళ్ల పాటు పనిచేశాడు. తనకు హోటల్ రంగంతో ఉన్న అనుబంధం ఉండటంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నాడు.. 

చెన్నై, ముంబాయి వంటి ప్రాంతాల్లో బుల్లెట్ బండిపై మొబైల్ బార్భీక్యూ చికెన్ దుకాణాన్ని చూసి ఇన్ స్పైర్ అయ్యాడు. తాను కూడా ఈ విధంగా పెడితే బాగుంటుందనుకున్నాడు. అనుకున్నట్లుగానే బుల్లెట్ బండిని కొనుగోలు చేశాడు. రూ.3 లక్షలు వెచ్చించి బుల్లెట్ కి బార్భీ క్యూ అమర్చాడు. వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేస్తున్నాడు. 

కొవ్వూరు పట్టణంలో కొత్తరకంగా వ్యాపారం ప్రారంభించడంతో స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వెరైటీ ఫుడ్ తినడానికి మాంసాహార ప్రియులు క్యూ కడుతున్నారు. బుల్లెట్ బండికి అన్నీ అమర్చుకోవడంతో వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రాంతాలకు మార్చుకోవచ్చని శివ అంటున్నారు. అంతేకాదు విందు భోజనాలకు సైతం వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి సరఫరా చేస్తానని చెబుతున్నారు.   

 

 

 

Leave a Comment