ప్రియుడి కోసం నదిలో ఈదుకుంటూ ఇండియాలోకి వచ్చింది.. చివరికి..

ప్రియుడి కోసం ఓ యువతి సాహసమే చేసింది. ఏకంగా దేశం సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు చివరికి అరెస్ట్ అయ్యింది.. వివరాల మేరకు బంగ్లాదేశ్ కి చెందిన కృష్ణ మండల్‌ (22) అనే యువతికి కోల్ కతాకి చెందిన అభిక్ మండల్ తో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం ప్రేమగా మారింది. ప్రియుడిని కలిసేందుక ఆ యువతి రిస్క్ చేసింది. సరిహద్దుల్లో రాయల్‌ బెంగాల్‌ పులుల నివాసమైన దట్టమైన సుందర్బన్‌ అడవుల గుండా ప్రయాణించింది. గంటపాటు నదిలో ఈది భారత్‌లోకి ప్రవేశించి ప్రియుడిని కలుసుకుంది. 

మూడు రోజుల క్రితం కోల్‌కతాలోని కాళీఘాట్‌ ఆలయంలో అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది.. అయితే ఆమె నిబంధనలు ఉల్లంఘించి దేశంలోకి అక్రమంగా ప్రవేశించింది. దీంతో పోలీసులు కృష్ణ మండల్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌ హై కమిషనర్‌కు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. 

Leave a Comment