అరటి పండ్లు ఈ సందర్భాల్లో తినకూడదని మీకు తెలుసా..!

అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ధి పొందిన పండు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. అరటిపండు అందరకి అందుబాటులో ఉండే, బలవర్ధకమైన పండు. అజీర్తి ని, మలబద్ధకాన్ని పోగొట్టి, శరీరానికి మేలు చేస్తుంది. హిందూ సంప్రదాయం లో ఏ శుభకార్యనికైనా అరటిపండుదే ప్రముఖ స్థానం.

రోజుకో ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. ఒక్క ఆపిల్ మాత్రమే కాదు రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా జీవించొచ్చు. చవకగా, అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం ద్వారా అనేక రోగాల నుంచి బయటపడొచ్చు.

 సాధారణంగా అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. శరీరంలో తక్షిణ శక్తిని అందించడమే కాకుండా..బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే గుండెను రక్షిస్తుంది. 

వంద గ్రాముల బరువుడే అరటి పండులో 0 శాతం కొవ్వు, 0 శాతం కొలెస్ట్రాల్, 258 మిల్లీగ్రాముల పొటాషియం, 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ B6, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి,  సమృద్ధిగా ఉంటాయి. 

ఆరోగ్యానికి మేలు చేసే అరటి పండ్లు కొన్ని సందర్భాల్లో హాని కల్గించే అవకాశం ఉంది. రాత్రిళ్లు అరటి పండును అస్సలు తినకూడదు. అలాగే శ్యాస తీసుకోవడంలో సమస్య ఉన్నవారు.. జలుపు, దగ్గు ఉన్నప్పుడు అరటి పండ్లను తినవద్దు. 

అరటి పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే చలికాలంలో అరటి పండ్లను తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే బరువు అదుపు చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. గుండెజబ్బులను తగ్గించడంలోనూ అరటి పండ్లు ఉపయోగపడుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు పెరగదు. అరటి పండ్లలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది అందరికి చాలా మంచిది ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణ కోశ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. అదే విధంగా జీర్ణాశయానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. 

బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా అరటిపండు తినండి. అరటి పండులో కొవ్వు ఉండదు. అలాగే, క్యాలరీలు కూడా చాలా తక్కువ. పూర్తిగా పక్వానికి రాని అరటిలో రెసిస్టెంట్ స్కార్చ్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. జిమ్‌లో కసరత్తులు చేసేవారు అరటి పండ్లు తిన్నట్లయితే కండరాలకు ఉపశమనం లభిస్తుంది.

ఇక సైనస్ సమస్య ఉన్నవారు అరటి పండ్లను అస్సలు తినకూడదు. వీరు అరటి పండు తినడం వలన శరీరంలో శ్లేష్మం ఎక్కువగా పేరుకుపోతుంది. వీరు అరటి పండ్లను తినకూడదు. అలాగే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.

 

Leave a Comment