ఏపీలో న్యూఇయర్ వేడుకలు రద్దు..!

న్యూ ఇయర్ వేడుకలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డిసెంబర్ 31, జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకలను రద్దు చేసింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. ఈనెల 26 నుంచి జనవరి 1 వరకు అన్ని రకాల వేడుకలను రద్దు చేేసింది. 

అంతే కాదు డిసెంబర్ 31, జనవరి 1 ఆ రెండు రోజులు రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా కుదించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రం కరోనా కేసులు తక్కువగానే ఉన్నా, జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా సెకెండ్ వేవ్ ప్రబలే అవకాశం ఉందని కేంద్ర వైద్య నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

Leave a Comment