మరో 47 యాప్స్ పై బ్యాన్..లిస్టులో పబ్ జీ, లూడో..!

గత నెలలో నిషేధించిన 59 యాప్ లలో క్లోన్ గా ఉన్న మరో 47 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించింది. నిషేధించిన ఈ 47 యాప్ ల జాబితా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. భారత ప్రభుత్వం నిషేధించిన 47 యాప్స్ లో పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్ జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అలీ ఎక్స్ ప్రెస్ లాంటి ఉన్నట్లు తెలుస్తోంది. 

వీటితో పాటు చైనాకు చెందిన 275 యాప్లను భారత్ నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండియాలో బాగా పాపులర్ అయిన టిక్ టాక్, హెలో లాంటి 59 యాప్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ భద్రతకు ముపు కలిగించే 275 యాప్స్ ను నిషేధించాలని నిర్ణయించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటాను తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందు ఉంచారు. ఈ యాప్స్ బ్యాన్ లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. 

 

Leave a Comment