కరోనా వ్యాక్సిన్ అసలు రాదు : బాలకృష్ణ

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రాలేదని, అసలు వ్యాక్సిన్ రాదని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తలు వాస్తవం కాదని బాలకృష్ణ చెప్పారు. అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని, కరోనా నిబంధనలు పాటిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలని బాలయ్య పేర్కొన్నారు. 

విర్గో పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ‘సెహరీ’ సినిమా ఫస్ట్ లుక్ ను ఆయన సోమవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా మన జీవితాంతం ఉంటుందని, కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని వ్యాఖ్యానించారు. కాగా కరోనా కట్టడికి పలు దేశాల్లో వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Leave a Comment