17 నెలలుగా జైల్లో.. మరీ ఆ బిడ్డకు తండ్రి ఎవరూ?

అత్యాచార కేసులో 17 నెలల జైలు శిక్ష అనంతరం ఓ వ్యక్తికి బెయిల్ మంజూరైంది. డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా బాధితురాలి బిడ్డకు అతడు తండ్రి కాదని తేలింది. దీంతో ముంబై కోర్టు ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. వివరాల మేరకు ఓ యువతి పుట్టుకతోనే మూగ, చెవిటి. ఆ యువతి పాఠశాలలో ఉండగానే విపరీతమైన కడుపునొప్పి వచ్చింది.

 దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై ఆరాతీయగా, పక్కంటి వ్యక్తి తనపై రెండు సార్లు అత్యచారం చేశాడని ఆ యువతి తెలిపింది. దీంతో 2019 జూలై 23న ఆ వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఇప్పటి వరకు అతడు 17 నెలల జైలు శిక్ష అనుభవించాడు. 

అయితే ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని పేర్కొంటూ రెండు సార్లు బెయిల్ దాఖలు చేయగా, బెయిల్ మంజూరు కాలేదు. తాజాగా డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా ఆ యువతి బిడ్డకు ఆ వ్యక్తి తండ్రి కాదని తేలింది. దీంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే  ఆ యువతికి తండ్రి ఎవరనే ప్రశ్నా అలాగే మిగిలిపోయింది.  

 

Leave a Comment