ఇలా చేస్తే నడుము నొప్పి మాయం..!

ఈ రోజుల్లో నడుము నొప్పి సర్వసాధరణమైపోయింది. ముప్పై ఏళ్లు దాటని వారూ కూడా నడుము నొప్పితో బాదపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జీవిన అలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో ఇలా ఎన్నో ఈ సమస్యకు కారణమవుతున్నాయి. ఇంతే కాక కంప్యూటర్ పైనే ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల నడుము నొప్పితో బాదపడుతున్నారు. అయితే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలను ఇప్పుము చూద్దాం..

  • ప్రతి రోజూ ఖర్చూరం తిన్న తర్వాత వేడి నీరు తాగితే నముడు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
  • గంధం, శొంఠిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని నడుముకు రాయాలి. ఇంకా నొప్పి తగ్గకుండా ఆ మిశ్రమం మీద తెల్లజిల్లుడు ఆకులు కడితే బాగా పనిచేస్తుంది. 
  • ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని అందులో మూడు టీస్పూన్లు సున్నపు తేట వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వారం రోజుల పాటు ఉదయాన్నే తాగాలి. ఇలా చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. 
  • తెల్ల చామంతి పూలతో చేసిన కషాయంతో నడుము నొప్పిని తగ్గించవచ్చు.
  • రెండు చెంచాల గసగసాల పొడిని గ్లాసు పాలలో కలపుకొని రోజుకు రెండు సార్లు తాగినా నొప్పి తగ్గుతుంది. 
  • నొప్పిగా ఉన్న ప్రదేశంలో ముందు ఐస్ ప్యాక్ తర్వాత హాట్ ప్యాక్ ఉంచిన ఉపశమనం పొందవచ్చు. 
  • కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి కాచిన తర్వాత ఆ నూనెను నొప్పి ఉన్న చోట రాయాలి. 
  • రెండు కప్పుల నీటిలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి, ఒక కప్పు అయ్యే వరకు మరగించాలి. దానిని వడగట్టి, చల్లార్చిన తర్వాత తేనె కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.
  • నొప్పి ఉన్న చోట అల్లం పేస్టును కాసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది. 

 ఈ ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఫలితం ఉండకపోతే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవడం చేయాలి. వారు ఇచ్చే సలహాలు, సూచనల మేరకు కొన్ని రోజుల పాటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సమస్యను ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు…

Leave a Comment