పుట్టగానే డాక్టర్ మాస్క్ లాగేసింది..!

ప్రస్తుతం మాస్క్ తప్పనిసరి అయింది. ఒకప్పుడు కేవలం వైద్య సిబ్బంది మాత్రమే మాస్క్ వాడే వారు. కానీ ఇప్పుడు మాస్క్ అందరి జీవితాల్లో భాగమైపోయింది. కాగా, యూఏఈకి చెంది గైనకాలజిస్ట్ డాక్టర్ సమీర్ చీబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. అప్పుడే పుట్టిన చిన్నారి డాక్టర్ సమీర్ మాస్క్ ను చేతితో లాగేస్తుంది.. దానికి ఆయన చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ ఫొటో నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ ఫొటోను గతంలో ఓ డెలివరీ సందర్భంగా ఆపరేషన్ థియేటర్ లో తీశారు. దీనికి ఇన్ స్టాగ్రామలో షేర్ చేశారు. దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. ‘త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనం అందరం కోరుకుంటున్నాం కదా’ అంటే పేర్కొన్నారు. ఈ ఫొటో షేర్ చేసిన వెంటనే తెగ వైరల్ అవుతుంది. 2020లో చూసిన అద్భుతమైన ఫొటో ఇదే అంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు… 

Leave a Comment