చూడముచ్చటగా ఉన్న అరుదైన లేగదూడ.. వీడియో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ లేగదూడ చూడముచ్చటగా ఉంది. ఆ దూడ యజమాని దానికి అలంకరించి గంటలు కట్టాడు. దీంతో అది కలుదులుతుంటే ఆ గంటలు మోగుతూ క్యూట్ గా కనిపిస్తోంది. ఇది ప్రత్యేక జాతికి చెందిన లేగదూడ. 

చిత్తూరు జిల్లాలోని పంగనూరులో ఈ జాతి ఆవులు ఉంటాయి. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. వాటి బరువు 150 నుంచి 200 కేజీలు ఉంటుంది. అయితే అవి పాలు మాత్రం రోజు 4 నుంచి 5 లీటర్ల వరకు ఇస్తాయి. అవి చాలా చిక్కగా కూడా ఉంటుంది. ఈ వీడియోను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజీవ్ కృష్ణ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.