కరోనా విరుగుడుకు పతంజలి ‘కరోనిల్’ విడుదల చేసిన బాబా రామ్ దేవ్..

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా కట్టడికి కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇటీవల ముంబాయికి చెందిన గ్లెన్ మార్క్ సంస్థ టాబ్లెట్ ను తయారు చేసింది. హైదరాబాద్ కు చెందిన హెటెరో సంస్థ కూడా ఇంజెక్షన్ ను రూపొందించింది. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ కరోనాకు విరుగుడు మందును తయారు చేసి విడుదల చేసింది. ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని పతంజలి యోగా పీఠ్ వేదికగా యోగా గురువు బాబా రామ్ దేవ్ ఈ మెడిసి లాంచ్ చేశారు. 

మంగళవారం కరోనా యొక్క ఆయుర్వేద ఔషధం ‘కరోనిల్’ పేరుతో ప్రారంభించారు. ఈ ఔషధం కరోనా రోగులను నాలుగు నుంచి 15 రోజుల వ్యవధిలో నయం చేస్తుందని బాబా రామ్ దేవ్ ప్రకటించారు. ఇప్పటికే 280 మంది కరోనా రోగులపై దీనిని ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తయారు చేసిన కరోనిల్ కరోనా రోగులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. 

ఈ ఆయుర్వేద ఔషధాన్ని తయరు చేసేందుకు ప్రత్యేక గ్రంథాలను మరియు వేదాలను చదివిన తరువాత తయారు చేశారు. ఈ ఔషధాన్ని గిలోయ్, అశ్వగంధ, తులసి, శ్వసరి రసం మరియు అణు నూనె మిశ్రమంతో తయారు చేశారు. 

 

Leave a Comment