కరోనాతో మరణించాక ఉద్యోగం వచ్చింది..!

కరోనా ఓ యువకుడి ఆశలపై నీళ్లు చల్లింది. ఉద్యోగానికి ఎంపికైన వార్త తెలీనీయకుండానే అతన్ని బలి తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించి.. ఫలితం వచ్చేలోపే కన్నుమూశాడు బీహార్ కు చెందిన అవినాష్..

వివరాల మేరకు బీహార్ కు చెందిన 30 ఏళ్ల అవినాష్ కు చిన్నప్పటి నంచి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఉద్యోగం సాధించాలనే కల ఉండేది. బీటెక్ పూర్తి చేసిన తర్వాత అతనికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా పోలేదు. 

ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కోచింగ్ తీసుకొని కష్టపడి చదివి పరీక్షలు రాశాడు. ఫలితాల కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నాడు. అయితే ఇటీవల అవినాశ్ కరోనా బారిన పడ్డాడు. కొన్ని రోజుల పాటు డాక్టర్ల సలహాలతో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు. 

డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్లీ అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చేరాడు. జూన్ 24న శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతూ మరణించాడు. అయితే జూన్ 30న బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఫలితాలు వెల్లడించింది. ఆ ఫలితాల్లో అవినాశ్ డిప్యూటీ కలెక్టర్(డీసీ) లేదా డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) స్థాయి ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిసింది. అయితే తన కల సాకారమైందని సంతోషించడానికి అవినాశ్ లేడు.. ఇది తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.   

Leave a Comment