అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు సీక్రెట్ ఇదే..!

ఇటీవల నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని వద్ద మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేష్ తనను తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడని నానా హంగామా చేశాడు. అతడి నిజస్వరూపం బయటపెడతానంటూ.. ఫోటో షూట్ చేయించుకుంటున్న అవసరాల దగ్గరకు వెళ్లి అతడి క్యాప్ తీసేశాడు. దీంతో అవసరాల బట్టతల బయటపడింది. దీంతో నెటిజన్లు షాక్ అయ్యారు. 

అయితే అవసరాల బట్టతల వీడియో వెనుక ఉన్న అసలు నిజం బయటపడింది. సినిమా ప్రమోషన్ కోసమే ఈ వీడియో అన్న క్లారిటీ వచ్చేసింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా పోస్టర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్న ఈ పోస్టర్ ను చూసిన ఎవరికైనా బట్టతల వీడియోపై స్పష్టత వచ్చేస్తుంది. 

Leave a Comment