ఆటో ఇల్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!

ఆ ఇల్లును చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఇలాంటి ఇల్లు కూడా ఉంటుందా అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అదే ఆటో హౌస్.. నిజమే.. తమిళనాడుకు చెందిన ఎన్జీ అరున్ ప్రభు అనే యువకుడు ఏడాది క్రితం ఆటోపై ఇంటిని నిర్మించాడు. ఆ ఇంట్లో చిన్న బెడ్రూంతోపాటు, కిచెన్, లివింగ్ ఏరియా, వర్క్ ఏరియా, బాత్ రూం కూడా ఉన్నాయి.

ఈ ఇంటిని నిర్మించడానికి అతనికి రూ.లక్ష ఖర్చు అయింది. ఆటో ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ ఇల్లు కూడా వెళ్లిపోతుంది. తాజాగా ఈ ఇంటిని చూసి మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తమ కంపెనీకి చెందిన బొలేరో వాహనంలో ఇలాంటి ఇంటిని నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అరుణ్ ప్రభు మరిన్ని పెద్ద ప్రాజెక్టులను డిజైన్ చేయాలని కోరారు. బొలెరో లాంటి పికప్ వాహనాలను కూడా కారవాన్లుగా మార్చాలన్నారు. అలా చేయాలంటే తనను కలవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 

Leave a Comment