అటం 1.0 ఎలక్ట్రికల్ బైక్ లాంచ్..ధర రూ.50 మాత్రమే..!

హైదరాబాద్ కు చెందిన ఎలక్ట్రికల్ వాహనాల స్టార్టప్ ఆటో మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ మంగళవారం రూ.50 వేలు విలువ కలిగిన కొత్తతరం ఎలక్ట్రిక్ బైక్ అటం 1.0ను విడుదల చేసింది. వీటిని విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ జి.వంశీ గడ్డం ప్రారంభించారు. ఇందులో పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల్లో ఈ బైక్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒకే ఛార్జీలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.  ఈ ఎలక్ట్రికల్ బైక్ రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ బైక్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు మరియు నడిపే వారికి లైసెన్స్ కూడా అవసరం లేదు. 

ఈ బైక్ ప్రారంభ ధర రూ.50 వేలు మాత్రమే ఉంటుంది. పటాన్ చెరువులో దీని తయారీ కేంద్రం ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,500 బైక్స్ అని, డిమాండ్ ను బట్టి అదనంగా 1000 బైక్ లను ఉత్పత్తి చేస్తామని కంపెనీ ఫౌండర్ వంశీ గడ్డం పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు కృషి చేసి ఈ బైక్ ను తయారు చేశామన్నారు. అటం 1.0 కేవలం 6 కిలోల తేలికపాటి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ బైక్ ఛార్జింగ్ కి ఒక యూనిట్ మాత్రమే తీసుకుంటుంది. సాంప్రదాయ ఐసీఈ బైక్ లతో పోలిస్తే అటం 1.0 రోజు వారీ ఖర్చు చాలా తక్కువ. దీంతో వినియోగదారులకు ఎంతో లాభం కలుగుతుంది.  

Leave a Comment