కోవిడ్ కేర్ సెంటర్ లో వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్..!

కరోనా రోగి చనిపోవడంతో బంధువులు జూనియర్ డాక్టర్ కుమార్ సేనాపతిపై దాడికి పాల్పడ్డారు.ఈ ఘటన అసోంలోని ఓబాలి మోడల్ కోవిడ్ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ కేసులు పోలీసులు 24 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. ఫ్రంట్ లైన్ కార్మికులపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. 

యువ వైద్యుడిపై దాడిని ఐఎంఏ ఖండించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే యువ డాక్టర్ కుమార్ సేనాపతి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో విధుల్లోకి వెళ్లాడాడని, ఆయనపై దాడిని ఖండిస్తున్నామని అసోం శాసన సభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ నుమల్ మోమిన్ తెలిపారు.  

Leave a Comment