‘అసని’ ఎఫెక్ట్.. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మందిరం..!

‘అసని’ తుపాను ప్రభావంతో ఏపీలోని శ్రీకాకులం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం సున్నపల్లి సముద్ర తీరానికి బంగారు రంగు మందిరం కొట్టుకొచ్చింది. దీనిని గమనించిన స్థానికులు తాళ్లతో కట్టి ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.. 

దీనిని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. ఈ రథం మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందిన అయి ఉండొచ్చని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. ఇవి వేరే దేశం నుంచి వచ్చి ఉండవచ్చని, తాము ఇంటెలిజెన్స్, ఉన్నతాధికారులకు సమాచారం అందించామని మెరైన్ పోలీసులు తెలిపారు.  

 

 

 

View this post on Instagram

 

A post shared by Eenadu (@eenadulivenews)

Leave a Comment