ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు ఘాటు వ్యాఖ్యలు..!

యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు తెరపై వినోదాన్ని పంచుతూ అందరికీ బాగా సుపరిచితురాలైన నటి సురేఖా వాణి.. తెలుగు సినిమాల్లో భార్య, కోడలు, తల్లి పాత్రల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. గ్లామర్ లో హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. 

అయితే ఇటీవల సురేఖా వాణిపై కొన్ని వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సింగర్ సునీత తరహాలోనే రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వచ్చాయి. ఇక సురేఖా కూతురు సుప్రీత కూడా తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించినట్లుగా గాసిప్ వినిపించాయి. 

ఈ వార్తలను సురేఖా వాణి ఖండించారు. తన జీవితంలో ఒక్కసారే పెళ్లి అని, మరో సారి పెళ్లి చేసుకోనని స్పష్టం చేశారు. తనకు ఆ ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. తన కూతురితో తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ వార్తలపై ఆమె కూతురు సుప్రీత కూడా స్పందించారు. 

తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తన అమ్మపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు. ‘ఉన్న న్యూస్ ఏదో చెప్పండయ్యా.. కొత్తగా క్రియేట్ చేయకండి.. కనీసం మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అని చెప్పుకోండి.. ఆదాయం కోసం ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టను ఎలా నాశనం చేస్తారు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. 

Leave a Comment