డొనాల్డ్ ట్రంప్ కు అరెస్టు వారెంట్..

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ట్రంప్ ను అరెస్టు చేయడంలో సహకారం కావాలంటూ ఇంటర్ పోల్ ను కోరింది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో బగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనికాధికారి చనిపోయాడు. ఇందుకు ట్రంప్ ను అరెస్టు చేస్తామని ఇరాన్ ప్రకటించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. 

బగ్దాద్ లో ఈ ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్ ఖాసిం సులేమానిని చంపబడ్డారు. ఈ ఘటనలో ట్రంప్ తో పాటు 30 మందికిపైగా ఇతరులపై హత్య, ఉగ్రవాద అభియోగాలున్నాయని అసోసియేట్ ప్రెస్ టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమెహర్ పేర్కొటూ ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ నివేదించింది. అరెస్టు వారెంట్ లో ఇతర వ్యక్తి పేరు పెట్టలేదని ప్రాసిక్యూటర్ తెలిపారు. ట్రంప్ అధ్యక్ష పదవి ముగిసిన కూడా విచారణను కొనసాగిస్తుందని అన్నారు. అరెస్టు వారెంట్ పై గ్లోబల్ పోలీస్ ఏజెన్సీ ఇంటర్ పోల్ ఇంకా వ్యాఖ్యానిచలేదు. 

Leave a Comment