బలవంతంగా డబ్బులు లాక్కుని, ఇంటికి శాపనార్థాలు.. ట్రాన్స్ జెండర్లు అరెస్ట్..!

ట్రాన్స్ జెండర్లు తమ చర్యలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. తమ అసభ్య ప్రవర్తనతో అసహ్యం పుట్టిస్తున్నారు. తాజాగా ఓ ఇంటి యజమానితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు బలవంతంగా జేబులోని డబ్బులు లాక్కున్నారు. ఈ ఘటనలో నలుగురు ట్రాన్స్ జెండర్లను హైదరాబాద్ లోని పేట్ బహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 

దూలపల్లి గ్రామానికి చెందిన మల్లేశం కొత్తగా ఇల్లు నిర్మించుకుని సోమవారం గృహ ప్రవేశం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్ జెండర్లు స్వామి, శ్రావణి, శివాని, భూమిలు వచ్చి తమకు ఇనాం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. గృహ ప్రవేశం సందర్భంగా తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేక పోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని గొడవ పడ్డారు. 

డబ్బులు ఇచ్చేందుకు మల్లేశం ఒప్పుకోకపోవడంతో ఇంటిపై రాళ్లు మట్టి పోసి శాపనార్ధాలు పెట్టారు. అంతటితో ఆగకుండా తమ శరీర భాగాలను చూపించడమే కాకుండా మల్లేశం జేబుల్లోంచి రూ.4 వేలు బలవంతంగా లాక్కున్నారు.  మల్లేశం పోలీసులకు ఫిర్యదు చేయడంతో ట్రాన్స్ జెండర్లపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.