5 గంటలకు మించి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించడం అసంభవం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ పోన్ వాడకం సాధారణమైపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పెరగడంతో ప్రతి ఒక్కరూ వాటిలో లీనమైపోతున్నారు.  ఇక యువత అయితే వాట్సాప్ చాటింగ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా యాప్స్ లకు అడిక్ట్ అయిపోతున్నారు.  కాని స్మార్ట్ ఫోన్ ను మితిమీరి వాడితే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

స్మార్ట్ ఫోన్ ను రోజుకు 4 నుంచి 5 గంటల కంటే ఎక్కువ వాడటం ప్రమాదకరమని చెబుతున్నారు. కంటి సమస్యలు మరియు మానవ శరీరం యొక్క నరాలకు హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే కాక గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని అంటున్నారు. 

కొలంబియాకు చెందిన సైమన్ బొలివర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సైంటిస్టులు 1060 మంది విద్యార్థులపై చేపట్టిన అధ్యయనంలో ఇది తేలింది. ఈ అధ్యయనంలో విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారనే వివరాలను కూడా రాబట్టారు. 

ఈ అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ ను నిత్యం 5 గంటల కంటే ఎక్కవగా వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6 శాతం ఎక్కువగా ఉంటాయి. విద్యార్థినులు అయితే 57.4 శాతం వరకు ఉంటాయి..అని నిపుణులు తేల్చారు. దీని వల్ల స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

ఇక ఇంకో అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వారిలో మెమోరీ తగ్గుతుందని తేలింది. మానసిక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆందోళన, ఒంటరి తనం, స్వీయ గౌరవం తగ్గుతుందని నిరూపణ అయింది. స్మార్ట్ ఫోన్ మీ నిద్రలేమికి కూడా కారణమవుతుందని అధ్యయనాల్లో తేలింది.  కానుక నిత్యం స్మార్ట్ ఫోన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు..

 

Leave a Comment