మీరు జియో సిమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త..!

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమయాకులను ఆసరాగా చేసుకొని వారిని దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. జియో కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. జియో కస్టమర్ సర్వీస్ పేరుతో మోసానికి తెరతీశారు. జియో కస్టమర్లకు ఫోన్ చేసి మీ సిమ్ బ్లాక్ అవుతుందని, వెంటనే రీఛార్జ్ చేయాలని ఫోన్ చేస్తున్నారు. 

రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా జియో నెంబర్ కు రిఛార్జ్ చేసుకోవాలని చెబెతున్నారు. ఆ యాప్ ద్వారా కస్టమర్ల అకౌంట్లలో డబ్బులు మాయం చేస్తున్నారు. ఇలాంటి మోసానికి ఇద్దరు మహిళలు బలయ్యారు. రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న ఇద్దరు మహిళల నుంచి దాదాపు రూ.2.7 లక్షలు మాయం చేశారు. డబ్బులు పోయినట్లు గ్రహించిన ఇద్దరు మహిళలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జియో కస్టమర్లు సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Leave a Comment