ఇంట్లోకి ఎలుకలు వస్తున్నాయా? ఎలుకల్ని తరిమేయండిలా

చాలా మంది ఇళ్లల్లో ఎలుకలు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. ఇంట్లో ఎలుకలు ఒంటరిగా ఉండవు. ఒక ఎలుక దానితో పాటుగా చాలా ఎలుకలు ఉండేలా చేస్తుంది. ఈ ఎలుకల వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, ఆస్తమా వంటివి వస్తాయి. అందుకే ఎలుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఎలుకల్ని తరిమేందుకు మార్కెట్‌లో రకరకాల స్ప్రేలు, పెస్టిసైడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాడిని వాడితే అందులోని కెమికల్స్ మనకు హాని చేస్తాయి. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలుకల్ని చంపడం తెలుసుకోండి. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఎలుకల్ని ఇంట్లోకి రానివ్వకుండా చూడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం కూరకు ఉపయోగించే పుదీనా ఎలుకల పీడను వదిలిస్తుంది. మొదటగా పుదీనాతో తైలం చేసుకోవాలి. ఆ తైలంలో చిన్న చిన్న దూది ముద్దలను ముంచి తీసి ఇంట్లోని వేర్వేరు ప్రదేశాల్లో ఉంచాలి. ఎలుకలకు పుదీనా వాసన అస్సలు పడదు. దీంతో ఎలుకలు ఆ వాసనను తట్టుకోలేక మీ కంట కనపడకుండా పారిపోతాయి.

లవంగాలు మనకు సువాసన ఇచ్చినట్లు అనిపిస్తాయి. అందుకే వాటిని అనేక వంటకాల్లో ఉపయోగిస్తాం. అయితే ఆ లవంగాల వాసన పీల్చడం అంటే ఎలుకలకు కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. అసలు లవంగాల్ని చూస్తే చాలు ఎలుకలకు పిచ్చి కోపం వస్తుంది. లవంగాణలను తమకు బద్ధ శత్రువుల్లా ఎలుకలు ఫీలవుతాయి. ఎలుకలు వెళ్లే కన్నాల దగ్గర చిన్నచిన్న గుడ్డల్లో కొద్దిగా లవంగాల్ని ఉంచడం చేయాలి. దీంతో ఎలుకలు ఇక ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లిపోతాయి.

మనం వంటకాల్లో కారం పొడిని బాగా వాడుతుంటాం. కారం లేకుంటే చాలా మందికి ముద్ద దిగదు. మరి మన ఇంట్లో చాలా ఎలుకలు కనుక ఉన్నట్లైతే ఓ పాత గుడ్డపై కారాన్ని చల్లి ఆ గుడ్డను ఓ సంచిలో వేయాలి. ఆ తర్వాత వాటిని ఎలుకల రంధ్రాల దగ్గర ఉంచాలి. కారాన్ని ఎలుకలు తట్టుకోలేవు. ఎలుకలే కాదు చీమలు, బొద్దింకలు, పురుగులకు కూడా కారం అంటే నచ్చదు. అందుకే కారం మూలల్లో వేసినట్లైతే ఎలుకలు ఇంట్లో ఉండకుండా పారిపోతాయి.

ఉల్లి అంటే చాలా మందికి ఇష్టం. ఎటువంటి ఫ్రై ఫుడ్ ఐటెమ్స్ లోనైనా ఉల్లిపాయలను ఉపయోగించడం తప్పనిసరి. మరి అటువంటి ఉల్లిపాయల వాసన కూడా ఎలుకలకు అస్సలు పడదు. అందువల్ల కన్నాల దగ్గర, మూలల్లో ఉల్లిపాయలను ఉంచవచ్చు. ఎలుకలు అనుకోకుండా ఉల్లిపాయల్ని కొరికితే ఆ తర్వాత అవి కుళ్లిపోతాయి. అందుకే ఉల్లిపాయ పెట్టిన తర్వాత కొన్ని రోజులకు వాటిని తప్పనిసరిగా తొలగించాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే చెడు వాసనతో ఆ ఇంట్లో మీరు ఉండలేరు.

తినే సోడాను ఇంట్లోని ఎలుకలు తిరిగే ప్రాంతాలన్నింటిలో చల్లండి. తినేసోడాను చీపురుతో అటూ ఇటూ కదపండి. గాలిలో తినేసోడా కలిసి ఎలుకలకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఆ దుమ్మును పీల్చితే చాలు ఎలుకలు ఆ ఇంట్లో నుంచి పరారవుతాయి. ఇటువంటి పద్దతులు పాటించడం వల్ల ఎలుకలు ఇంట్లో ఉండకుండా పారిపోతాయి.

Leave a Comment