ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 పోస్టులు, దేవదాయశాఖలో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 

నోటిఫికేషన్ వివరాలు:

పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్

ఖాళీలు: 670

అర్హత : బ్యాచిలర్ డిగ్రీ, జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసై ఉండాలి. 

వయస్సు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 30 నుంచి జనవరి 19,2022 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్క్రీనింగ్, మెయిన్స్)

స్క్రీనింగ్ టెస్ట్ : మొత్తం 150 మార్కులు

సెక్షన్-A: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ – 100 మార్కులు

సెక్షన్-B: జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు – 50 మార్కులు

మెయిన్ ఎగ్జామినేషన్ : మొత్తం 300 మార్కులు

పేపర్-1 : జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు

పేపర్-2: జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు – 150 మార్కులు

పే స్కేల్: రూ.16,400 – రూ.49,870

పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 ఎండోమెంట్స్ సబ్ సర్వీస్

ఖాళీలు: 60(13 క్యారీ ఫార్వార్డ్ + 47 ఫ్రెష్)

అర్హత : బ్యాచిలర్ డిగ్రీ

వయస్సు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 30 నుంచి జనవరి 19,2022 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ – 150 మార్కులు

సెక్షన్-A: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ – 50 మార్కులు

సెక్షన్-B: హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టమ్ – 100 మార్కులు

పే స్కేల్: రూ.16,400 – రూ.49,870

వెబ్ సైట్ : https://psc.ap.gov.in/

 

 

 

Leave a Comment