నిరుద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం : నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నిరుద్యోగులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. 

ఎన్ఆర్ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 20కి పైగా నియామక సంస్థలు ఉన్నాయని, ఇప్పటి మూడు ఏజెన్సీల పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక నుంచి అన్ని నియామకాలు ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని వెల్లడించారు. 

 

Leave a Comment