పోలింగ్ కేంద్రంలో చిన్నారిని లాలించిన ఏపీ కానిస్టేబుల్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఏపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ మంచి మనుసు చాటుకున్నాడు. ఏపీకి చెందిన ఓ కానిస్టేబుల్ ఎన్నికల విధుల్లో భాగంగా తమిళనాడు వెళ్లాడు. అదే సమయంలో ఓ తల్లి నెల వయసున్న తన చిన్నారితో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. 

ఎండ తీవ్రంగా ఉండడం, లైన్ ఎక్కువగా ఉండడంతో చిన్నారి గుక్కపెట్టి ఏడ్చింది. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ బిడ్డను తనతో పాటు తీసుకుని టెంట్ కిందకు వచ్చాడు. చిన్నారి తల్లి ఓటు వేసి వచ్చే వరకు బిడ్డను ఎత్తుకుని లాలించాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోను ఏపీ పోలీసులు ట్విట్టర్ ల పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అనంతపురం పోలీస్ కానిస్టేబుల్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది.  

   

Leave a Comment