4500 చైనా గేమ్స్ తొలగించిన యాపిల్..

ఇటీవల చైనాకు చెందిన 59 యాప్లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే..ఆ తర్వాత చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ చైనీస్ యాప్ స్టోర్ లోని 4500 మొబైల్ గేమ్స్ ను తొలగించింది. ఇంత భారీ మొత్తంలో గేమ్స్ తొలగించడంతో చైనా కంపెనీలకు ఊహించని షాక్ తగిలింది.

 గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే చైనా గేమ్స్ ను తొలగించినట్లు యాపిల్ సంస్థ పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేని గేమ్స్ ను కూడా యాప్స్ లో పెడుతున్నట్లు తెలిపింది. లైసెన్స్ నిబంధనలు కఠినతరం చేస్తామని, ఈ నిబంధనలు పునరుద్ధరించిన తర్వాత చట్ట ప్రకారం గేమ్స్ అప్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 

Leave a Comment