ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక బుక్ చేసుకునే విధానం ..!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన వైసీపి ప్రభుత్వం ఇసుక కొత్త పాలసీని ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో చాలా మందికి ఇసుకను ఎలా కొనుగోలు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇసుక కొనుగోలు చేసే విధానాన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. అయితే ఇప్పడు ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుకు బుక్ చేసుకునే విధానాన్ని తెలసుకుందాం.

ఆర్డర్ చేసుకొనే విధానం :-

మొదటగా ఇసుక బుక్ చేసుకునేందుకు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మనం Sand.ap.gov.in సైట్ లో వెళ్లాలి. 

రిజిస్ట్రేషన్ బటన్ పై క్లిక్ చేస్తే అక్కడ మనకు రెండు ఆప్షన్స్ కనబడతాయి. 1. General cunsumer registration, 2. Bulk consumer Registration అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. 

మొదటగా మనం general cunsumer registrationపై క్లిక్ చేయాలి. అక్కడ మనకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది. 

ap sand

1.అక్కడ మనం ముందుగా Mobile Number ని ఎంటర్ చేయాలి. ఆ తరువాత send otp అనే బటన్ పై క్లిక్ చేస్తే మన  Mobile Numberకి otp send అవుతుంది. Mobile Number కి వచ్చిన otpని enter చేసి submit అనే బటన్ పై క్లిక్ చేయాలి.

ap sand 2

 

2.అనంతరం ఆధార్ నెంబర్ ను నమోదు చేసి  submit అనే బటన్ పై క్లిక్ చేయాలి. 

ap sand 3

 

 

౩.తరువాత మన Full Details నమోదు చేయాలి.  పేరు, జిల్లా, రూరల్ లేదా అర్బన్ ప్రాంతం, మండలం, గ్రామ పంచాయతీ, పూర్తి అడ్రస్, మెయిల్ ఐడీ నమోదు చేసి Next అనే బటన్ పై క్లిక్ చేయాలి. వెంటనే అది Confirmation పేజిలోకి వెళ్తుంది. 

ap sand 4

 

4.అక్కడ User Id అనే ఆప్షన్ వద్ద మన మొబైల్ నంబర్ ఉంటుంది.  ఆ తరువాత మనం accept అనే ఒక బాక్స్ మీద మనం క్లిక్ చేసి రిజిస్టర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మన Register complete అవుతుంది. ఆ తరువాత proceed to order sand అనే బటన్ పై క్లిక్ చేయాలి.అనంతరం మనకు ఒక లాగిన్ ఫాం ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మన మొబైల్ నెంబర్ enter చేసి send otp అనే బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మన మొబైల్ నంబర్ కు otp రావడం జరుగుతుంది. మనకు వచ్చిన otp ఎంటర్ చేసి Login అనే బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మనకు ఒక హోం పేజి ఓపెన్ అవుతుంది. 

ap sand 5

5.ఈ హోం పేజీలో మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు కావాల్సింది ఇసుక బుక్ చేయడం, అందుకోసం sand order అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. దీని తరువాత మీ పూర్తి సమాచారాన్ని అందులో నమోదు చేసి మీ చిరునామాకు ఇసుక బుక్ చేసుకోవచ్చు. 

 

NOTE : ఇసుక బుక్ చేసుకునే విధానంలో ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాలంలోనే ఇసుక స్టాక్ లభిస్తుందని గుర్తు పెట్టుకోవాలి.

Leave a Comment