మొబైల్ ద్వారా ఏపి లో ఇసుక ఆర్డర్ చేసే విధానం …!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన వైసీపి ప్రభుత్వం ఇసుక కొత్త పాలసీని ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో చాలా మందికి ఇసుకను ఎలా కొనుగోలు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇసుక కొనుగోలు చేసే విధానాన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. 

అయితే ఇప్పడు మొబైల్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుకు బుక్ చేసుకునే విధానాన్ని తెలసుకుందాం. మొదటగా ఇసుక బుక్ చేసుకునేందుకు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మనం ఒక అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

 అప్లికేషన్ : DOWNLOAD LINK 

ఈ అప్లికేషన్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం..

 

రిజిస్ట్రేషన్ బటన్ పై క్లిక్ చేస్తే అక్కడ మనకు రెండు ఆప్షన్స్ కనబడతాయి. 1. General cunsumer registration, 2. Bulk consumer Registration అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. 

 

మొదటగా మనం general cunsumer registrationపై క్లిక్ చేయాలి. అక్కడ మనకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది. 

ap sand

అక్కడ మనం ముందుగా Mobile Number ని ఎంటర్ చేయాలి. ఆ తరువాత send otp అనే బటన్ పై క్లిక్ చేస్తే మన  Mobile Numberకి otp send అవుతుంది. Mobile Number కి వచ్చిన otpని enter చేసి submit అనే బటన్ పై క్లిక్ చేయాలి. 

ap sand

 

అనంతరం ఆధార్ నెంబర్ ను నమోదు చేసి  submit అనే బటన్ పై క్లిక్ చేయాలి. 

తరువాత మన Full Details నమోదు చేయాలి.  పేరు, జిల్లా, రూరల్ లేదా అర్బన్ ప్రాంతం, మండలం, గ్రామ పంచాయతీ, పూర్తి అడ్రస్, మెయిల్ ఐడీ నమోదు చేసి Next అనే బటన్ పై క్లిక్ చేయాలి. వెంటనే అది Confirmation పేజిలోకి వెళ్తుంది. 

ap sand

అక్కడ User Id అనే ఆప్షన్ వద్ద మన మొబైల్ నంబర్ ఉంటుంది.  ఆ తరువాత మనం accept అనే ఒక బాక్స్ మీద మనం క్లిక్ చేసి రిజిస్టర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మన Register complete అవుతుంది. 

 

అనంతరం మనకు ఒక లాగిన్ ఫాం ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మన మొబైల్ నెంబర్ enter చేసి send otp అనే బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మన మొబైల్ నంబర్ కు otp రావడం జరుగుతుంది. మనకు వచ్చిన otp ఎంటర్ చేసి Verify అనే బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మనకు మన పేరు, Book Now అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేేయాలి. 

ap sand

ఇక్కడ ముందుగా మీ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీ పూర్తి చిరునామాను అందులో నమోదు చేసి మీకు కావలసిన పరిమానంలో ఇసుకను సెలెక్ట్ చేసుకుని Make Payment అనే ఆప్షన్ ని క్లిక్ చేసి అక్కడి నుంచి డబ్బు చెల్లించి ఇసుక ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ap sand

 

ఈ విధంగా చాలా సులభంగా మొబైల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చు.  

 

NOTE : ఇసుక బుక్ చేసుకునే విధానంలో ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాలంలోనే ఇసుక స్టాక్ లభిస్తుందని గుర్తు పెట్టుకోవాలి. 

Leave a Comment