రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు.. మధ్యాహ్నం 1 గంట వరకు బస్సుల బంద్..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈనెల 5న అంటే శుక్రవారం ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటించినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని తెలిపారు. విశాఖ స్టీల్ ను ప్రజల ఆస్తిగానే ఉంచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందన్నారు. 

అయితే రేపటి రాష్ట్ర బంద్ నేపథ్యంలో ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోకుండా ఆర్టీసీ బస్సులను శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు నడపరాదని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ తర్వాత ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులు తిరిగేలా సహకరించాలని కోరామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని అన్నారు. ప్రజలపై భారం మోపి ఏపీని గత ప్రభుత్వాలతు అప్పుల పాలు చేశాయని, పన్ను పీకుంచుకోవడానికి కూడా గత ప్రభుత్వాలు రేట్లు పెంచాయని తెలిపారు. 

Leave a Comment