AP EAMCET- 2020 నోటిఫికేషన్

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్ 2020 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ ( డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రి ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీవీఎస్వీ, ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, డీఫార్మా కోర్సులలో ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ ఎంసెట్ 2020ని నర్వహిస్తోంది. 

ప్రవేవ పరీక్ష కేంద్రాలు..

శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపురం, కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, నాచారం, సికింద్రాబాద్. అదనంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి, క్రిష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. 

దరఖాస్తు విధానం..

  • దరఖాస్తు ప్రారంభం – ఫిబ్రవరి 29, 2020
  • దరఖాస్తు చివరి తేదీ – అపరాధ రుసుం లేకుండా మార్చి 29, 2020

                                                    రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 5 వరకు 

                                                   రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 10 వరకు 

                                                   రూ.5వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు 

                                                   రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19 వరకు 

  • పరీక్ష ఫీజును http://sche.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చెల్లించాలి.
  • ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  • పరీక్షలు – ఇంజినీరింగ్ – ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో

                             అగ్రికల్చర్ – ఏప్రిల్ 23, 24 తేదీల్లో

  • ఊర్దు మాధ్యమం గల వారికి కర్నూలు మాత్రమే పరీక్ష కేంద్రంగా ఉంటుంది.
  • ఎంపీసీ విద్యార్థులకు గణితం 80 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40..మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • బైసీపీ విద్యార్థులకు ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బోటనీ 40, జువాలజీ 40..మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • ప్రశ్నలు, ఆప్షన్లు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటాయి. 

వెబ్ సైట్ –  http://sche.ap.gov.in

Leave a Comment