ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో.. ఏపీ చిన్నారికి చోటు.. ఏం చేసిందంటే..!

అతి చిన్న వయసులోనే ఓ చిన్నారి రికార్డులకు ఎక్కింది. ఏడాదిన్నర వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. కడప జిల్లా, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన చదవాల హర్ణిక అతి పిన్న వయసులో ఈ ఫీట్ అందుకుని అందరినీ ఔరా అనిపించింది. ఒక సంవత్సరం 8 నెలల 24 రోజుల వయసున్న ఈ చిన్నారి కేవలం ఒకే ఒక నిమిషంలో 24 జంతువుల బొమ్మలను గుర్తించి సంచలనం సృష్టించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ చిన్నారిని పరీక్షించి సర్టిఫికెట్, మెడల్ ను అందజేశారు.

చదవాల భాను ప్రకాష్, నాగజ్యోతి దంపతులు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు.. వీరిలో చదవాల హర్ణిక ఒకరు. హర్ణిక తన మెదడుకు పదును పెడుతూ ఒక నిమిషంలో 24 జంతువుల బొమ్మలను గుర్తిస్తోంది. ఈ ఏడాది జనవరి 10న తల్లిదండ్రులతో కలిసి ఈ పాప ఇండియాకి రాగా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆమెను పరీక్షించి, ఫిబ్రవరి ఒకటవ తేదీన మెడల్ తో పాటు సర్టిఫికెట్ ని పంపారు.

Leave a Comment