కరోనాపై అనుష్క, విరాట్ ఉద్యమం..!

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ పై దేశం పోరాటం చేస్తుందని, ఈ సమయంలో తమ వంతుగా విరాళాలు సేకరించాలని అనుకుంటున్నామని స్పష్టం చేశారు. 

కరోనా బాధితుల సహాయార్థం తమ వంతుగా రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు విరాట్, అనుష్క దంపతులు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, కరోనాపై దేశం పోరాటం చేస్తుండగా, ఈ పరిస్థితులలో ప్రజల పోరాటం చాలా కష్టంగా ఉందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 

తమ కోసం వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఎంతగానో కష్టపడుతున్నారని, వారికి ఇప్పుడు మనమందరం అండగా ఉండాలని పిలుపునిచ్చాడు. అందుకు అనుష్క శర్మ, తాను.. కెట్టోతో కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ను మొదలుపెడుతున్నామని వెల్లడించారు. మీరిచ్చే ప్రతి రూపాయి ఎంతో ఉపయోగపడుతుందని, మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చాడు. కరోనాను జయిద్దాం.. స్టే సేఫ్, స్టే హోమ్ అంటూ వీడియో సందేశంలో తెలిపారు. 

Leave a Comment