చైనాలో మరో కొత్త వైరస్..!

ప్రపంచం కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతోంది. మొదట్లో చైనాలో గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం నలిగిపోతుంది. ప్రస్తుతం కొత్త అధ్యయనం ప్రకారం చైనా పరిశోధకులు పందులలో కొత్త రకం వైరస్ ను కొనుగొన్నారు. ఈ వైరస్ మహమ్మారిగా మారగల సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఈ వైరస్ పందుల్లో వస్తుందని గుర్తించారు. కానీ అది మనుషులకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వైరస్ జీ4 అనే వైరస్ వల్ల కలుగుతుందని పేర్కొన్నారు. 

తాజాగా గుర్తించిన ఈ వైరస్ 2009లో బయటపడిన స్వైన్ ఫ్లూ లాంటిదే. కాని దీనిలో కొన్ని కొత్త మార్పులు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ వైరస్ వల్ల ప్రమాదం అయితే జరగలేదు. కాని దీనిని నిర్లక్ష్యం చేయకూడదని శాస్త్రవేత్తలు అన్నారు. ఇది పందుల పరిశ్రమల్లో పని చేసేవారికి ఇది వ్యాపిస్తుందని గుర్తించారు. ఈ కొత్త రకం వైరస్ మనషుల శ్వాసనాళంలో పెరుగుతుందని, తర్వాత తన సంఖ్యను పెంచుకుంటుందని పరిశోధకులు తెలుపుతున్నారు.  

Leave a Comment