సైప్రస్ లో మరో కొత్త వేరియంట్.. పెరుగుతున్న ‘డెల్టాక్రాన్’ కేసులు..!

కరోనా వైరస్ రోజుకో కొత్త వేరియంట్ తో ప్రపంచాన్ని వణికిస్తోంది. మొదట కరోనా.. తర్వాత డెల్టా వేరియంట్లు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.. ఇప్పుడు ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది.. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. రెండు వేరియంట్లు కలిసిన ‘డెల్టాక్రాన్’ వేరియంట్ సైప్రస్ లో బయటపడింది. 

ఈ కొత్త వేరియంట్ లో డెల్టా వేరియంట్ లక్షణాలు, ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో దీనికి ‘డెల్టాక్రాన్’ అని పేరు పెట్టారు. సైప్రస్ లో ఇప్పటి వరకు ఈ రకమైన కేసులు 25 నమోదయ్యాయి. ఈ వేరియంట్ కారణంగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని సైప్రస్ వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ డెల్టాక్రాన్ కేసులు పెరగే అవకాశం ఉంటుందన్నారు.   

అయితే ఈ కొత్త వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డెల్టాక్రాన్ వేరియంట్ డెల్టా, ఒమిక్రాన్ తో పోలిస్తే ప్రమాదకరమా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ డెల్టాక్రాన్ వేరియంట్ మూటేషన్ల స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ వేరియంట్ కనుగొన్న సైప్రస్ యూనివర్సిటీ వైరాలజీ నిపుణుడు లియోండస్ కోస్టిక్రిస్ తెలిపారు. డెల్టాక్రాన్ వేరియంట్ పై డబ్ల్యూహెచ్ఓ స్పందించాల్సి ఉంది.  

Leave a Comment