14 రోజులు లాక్ డౌన్.. ప్రజారవాణ బంద్..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది.. ప్రతి రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైన సేవలకు కూడా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కర్ణాటకలో రోజూ దాదాపు 10 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్ డౌన్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైన సేవలకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలను వేసివేయనున్నట్లు ప్రకటించింది. నిర్మాణం, తయారీ, వ్యవసాయ రంగాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ప్రజారవాణ పూర్తిగా మూసివేయబడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. 

 

Leave a Comment