ధోని కంటే ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన మరో భారత ఆటగాడు..వీడియో వైరల్..!

హెలికాప్టర్ షాట్ అంటేనే గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోనీ.. ఫుల్ లెంగ్త్ బాల్, యార్కర్ ను ఇట్టే బౌండరీ దాటిస్తాడు.. ఇక ఈ షాట్ ను కనిపెట్టింది ధోనినే అని చాలా మంది చెబుతారు.. అయితే హెలికాప్టర్ షాట్ ను ధోని కంటే ముందే మరో భారత ఆటగాడు ఆడి చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..

భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గతంలోనే హెలికాప్టర్ షాట్ ఆడాడు. 1996లో కోల్ కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అజారుద్దీన్ హెలికాప్టర్ షాట్ ఆడాడు.. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్లూసెనర్ వేసిన ఓవర్లో అజారుద్దీన్ 5 ఫోర్లు కొట్టాడు. మొదటి రెండు బౌండరీలు కొట్టడం వల్ల తదుపరి బంతిని యార్కర్ గా వేశాడు క్లూసెనర్.. ఆ బంతిని అజారుద్దీన్ హెలికాప్టర్ షాట్ ఆడాడు.. ఈ మ్యాచ్ లో అజారుద్దీన్ కేవలం 77 బంతుల్లో 109 రన్స్ చేశాడు..

Leave a Comment