మరో స్వతంత్ర పోరాటం చేయాలి..!

విజయవాడం ఎంపీ కేశినేని నాని

విజయవాడ : మరో స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరస్థితులు నేడు ఏర్పడ్డాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని కుల మత ప్రాంతాల వారీగా విభజించే హక్కు ఎవరిచ్చారని అమిత్ షా, మోడీలను సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. వారి ఓట్ల కోసం, వారి రాజకీయ లబ్ధి కోసం వారు చేస్తున్న పనులు దేశానికి నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ఆనాడు షేక్ అబ్దుల్లా లేకపోతే కశ్మీర్ పాకిస్థాన్లో ఉండేదన్నారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆర్టికల్ 370ని తీసుకొచ్చారన్నారు. 

పార్లమెంటరీయన్ అంటే ఎంటో చూపించాడు…

దేశంలో పార్లమెంటేరియన్ అంటే ఎలా ఉండాలో అసుదుద్దీన్ ఓవైసీ చూపించారన్నారు. దేశంలో మన పౌరసత్వాన్ని మనం రుజువు చేసుకోవాల్సిన పరిస్థతి ఏర్పడిందంటే దీనంత దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. మీరు ఇచ్చే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డులు పని చేయవన్నారు. పేద మధ్య తరగతి వారు ఎన్ఆర్సీ, సీఏఏ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఎన్ఆర్సీ, సీఏఏ లను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. వైసీపీ 22 మంది ఎంపీలు ఈ బిల్లులకు అనుకూలంగా ఓటు వేశారని, తమ పార్టీలో ఇద్దరు ఎంపీలు కూడా అనుకూలంగా ఓటు వేశారని, తాను ఓటు వేయకుండా బయటకు వచ్చానని అన్నారు. 

అసెంబ్లీలో తీర్మానం చేయాలి…

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ఆర్సీ, సీఏఏలపై వ్యతిరేకండా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని, టీడీపీ ఎమ్మెల్యేలు దానికి మద్దతు తెలుపుతారని చెప్పారు. వారు తీర్మానం పెడితే తమ టీడీపీకి చెందిన 21 ఎమ్మెల్యేలు దానికి మద్దతు తెలిపుతారని, దానికి తాను హామీ ఇస్తున్నాని తెలిపారు.

Leave a Comment