పొదుపు సంఘాల గ్రూపులకు మరో తీపికబురు

తక్కువ వడ్డీరేట్లకే రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు

ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాధి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మరో శుభవార్తను  రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు అధికంగా వుండటంతో, వాటిని తగ్గించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది. స్వయం సహాయక సంఘాల నుంచి వసూలు చేస్తున్న వడ్డీరేట్లను తగ్గించేందుకు పలు బ్యాంకులు ముందుకు వచ్చాయి. దాని ద్వారా ఏటా పొదుపు సంఘాలకు రూ.283 కోట్లు మేరకు మేలు జరుగనుంది. అలాగే ప్రభుత్వంపై కూడా సున్నావడ్డీ కింద చెల్లిస్తున్న దానిలో రూ.150.14 కోట్ల భారం తగ్గుతోంది.   

 బ్యాంకుల వారీగా సవరించిన వడ్డీరేట్లు

  • గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు సంఘాల రుణాలపై 12.50 శాతం వడ్డీరేటును వసూలు చేసేది.ప్రస్తుతం దానిని 9.25 శాతానికి తగ్గించింది. 
  • ఆంధ్రాబ్యాంక్, కార్పురేషన్ బ్యాంక్ లను విలీనం చేసుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో 12.50 శాతం వడ్డీరేటు వసూలు చేయగా, ప్రస్తుతం దానిని 8.10 శాతం నుంచి 9.60 శాతం వరకు తీసుకున్న రుణాలు, అడ్వాన్స్ లను బట్టి వసూలు చేస్తోంది. 
  •  ఆప్కాబ్ కూడా 12.50 శాతం నుంచి 10 శాతంకు వడ్డీరేట్ ను తగ్గించింది. 
  •  సిండికేట్ బ్యాంక్ తో  విలీనమైన కెనరా బ్యాంక్ కూడా 9.15 నుంచి 9.40 వరకు రుణాలు, అడ్వాన్స్ లపై వడ్డీరేట్లను తగ్గించింది. 

Leave a Comment