చైనాలో మరో వ్యాధి..లెవెల్-3 హెచ్చరికలు జారీ..!

ప్రస్తుతం ప్రపంచ కరోనా వైరస్ తో అల్లాడుతోంది. ఈ సమయంలో చైనాలో మరో వ్యాధి భయపెడుతోంది. చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్ లో ఇటీవల రెండు బుబోనిక్ ప్లేగు వ్యాధి కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా వెల్లడించింది. దీంతో ప్రపంచం మొత్తం మరో సారి ఉలిక్కి పడింది. ఇప్పుడు కరోనాతో విలవిలలాడుతున్న నేపథ్యంలో ఈ వార్త ఆందోళనకు గురి చేస్తోంది. 

అడవి ఉడుత మాంసం అమ్మే వ్యక్తికి మరియు అతడి తమ్ముడికి ప్లేగు వ్యాధి నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం లెవల్-3 హెచ్చరికలు జారీ చేసింది. తలనొప్పి, జ్వరం, చలి, శరీరంలో అక్కడక్కడ వాపులు, గ్రంధుల్లో నొప్పి, శరీరంలపై కొన్ని చోట్ల పండ్లతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరీక్షించగా ఈ వ్యాధి మూలాలు కనబడ్డాయి. ఈ వ్యాధి వచ్చిన వారికి సంబంధించిన 146 మందిని అధికారులు క్వారంటైన్ చేశారు.

బుబోనిక్ ప్లేగు వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఇది జంతువులు, మనుషులకు వ్యాప్తి చెందుతుంది.  అయితే ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం అందకపోతే 24 గంటల్లో రోగి మరణించే అవకాశం ఉందని WHO గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

 

 

Leave a Comment