పైజమాపై ఓంకారం.. నటిపై నెటిజన్ల ఆగ్రహం..

బాలీవుడ్ నటి అంకితా లోఖండేను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటఆడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫొటోలే..అందుటో ఏముందనుకుంటున్నారా? ఆమె ధరించిన పైజామాపై ఓం అని రాసి ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏమైందంటే..అంకిత తల్లి ఆమెకు ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ చేశారు. ఆ హెయిర్ స్టైల్ కి సంబంధించిన పొటోలను అంకిత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఆమె టీషర్టు, పైజామాతో ఉన్నారు. అయితే అంకిత ధరించిన పైజామాపై ఓం అని రాసి ఉంది. అయితే నెటిజన్లకు మాత్రం ఆమె హెయిర్ స్టైల్ మీద ఫోకస్ చేయలేదు… ఆమె ధరించిన పైజామా మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆమె ధరించిన పైజామాపై ఓం అని ఉండటమే.. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్ చేస్తున్నారు. 

ఒక నెటిజన్ ఏమన్నారంటే..‘మేడం నాకు మీతో శత్రుత్వం లేదు..నేను మిమ్మల్ని ఆటపట్టించడం లేదు..మీరు ధరించిన పైజామాపై ఓం అని రాసి ఉంది. మీరు దానిని పైజామాగా ఉపయోగించారు..మీరు దానిని కుర్తాగా ఉపయోగించండి’..అంటూ రిప్లే ఇచ్చాడు..ఇక మరో నెటిజన్ అయితే ‘ఈశ్వరుని పేరును కాళ్ల దగ్గరగా ఉంచడం తప్పు’ అని కామెంట్ పెట్టాడు.. 

 

Leave a Comment