Andrew Symonds Death : ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి..!

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్, దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(Andrew Symonds) మృతి చెందాడు. క్విన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లేలో గతరాత్రి సైమండ్స(46) కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లెజండరీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి చెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల పలువురు ఆటగాళ్లు, మాజీ సహచరువు విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఆస్ట్రేలియా లెజండరీ ఆటగాళ్లు రాడ్ మార్ష్ షేర్ వార్న్ మరణించిన సంగతి తెలిసిందే.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ల వరుస మరణాలతో ఆ దేశ క్రికెట్ అభిమానుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

ఆండ్రూ సైమండ్స్ 1998లో ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇంటర్నేషనల్ లో అరంగేట్రం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆండ్రూ సైమండ్స్ 198 వన్డేలు, 14 టీ20లు, 26 టెస్టులు ఆడాడు. ఆస్ట్రేలియా 2003, 2007 వరల్డ్ కప్ సాధించిన జట్లలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ లోనూ ఆండ్రూ సైమండ్స్ తన సత్తా చాటాడు. ఐపీఎల్ లో మొత్తం 38 మ్యాచులు ఆడాడు. 

 

 

   

Leave a Comment