ఈ నాలుగు రోజులు జాగ్రత్త.. ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు..!

యాస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులు వాతావరణ కాస్త చల్లబడింది. అయితే వాతావరణం ఇప్పుడు మళ్లీ వేడెక్కింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

గురువారం తూర్పగోదావరి లోని 12 మండలాలు, విజయనగరంలోని రెండు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 36, క్రిష్ణాలో 15 మండలాలు మిగిలిన చోట్ల మొత్తం 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 

అంతే కాదు గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పగోదావరి, పశ్చిమ గోదావరి, క్రిష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45-46 సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42-44 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది..

శుక్రవారం :

తూర్పు గోదావరి 28, పశ్చిమ గోదావరి 18, విజయనగరంలో 14 మండలాలు, మిగిలిన చోట్ల మొత్తం 63 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45-46 సెంటీగ్రేడ్, విశాఖపట్నం, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42-44 సెంటీగ్రేడ్, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39-41 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. 

శనివారం:

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C, విశాఖపట్నం, ప్రకాశం,  నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది..

ఆదివారం:

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు  జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C, విశాఖపట్నం, ప్రకాశం,  నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది..

 

Leave a Comment