ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం పదో తరగతి మార్కుల మెమోలు విడుదల చేశారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు. రెండు సంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 

కరోనా కారణంగా పరీక్షలు రద్దు కావడంతో ఫలితాల వెల్లడి కోసం ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గ్రేడ్లు కేటాయించారు. 2020 మార్చి, 2021 జూన్ కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు. ఇంటర్నల్ గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించారు. 

ఫలితాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి..

https://www.bse.ap.gov.in/ 

 

Leave a Comment